ఎం.బి.ఎ చేస్తూ పార్ట్ టైం జాబ్ చేసే దాన్ని. అక్కడ ఖాన్ కళ్ళు నా పైన పడ్డాయి. నేను అతనికి లొంగి రాలేదు. దానితో నా పై యాసిడ్ పోయించాడు. నా కన్ను పోయింది. ఇంకో కన్ను దృష్టి దెబ్బతింది నా మొహానికి ఇరవై కి పైన ఆపరేషన్లు జరిగాయి. అయినా నేను కోల్పోలేదు. ఎంతో మానసిక క్షోభ తర్వాత ఎందరో ఆసిడ్ బాధితులతో కలిసి పనిచేశాక బ్రేవ్ సోల్ ఫౌండేషన్ పేరుతో ఒక ఎన్జీవో ప్రారంభించాను. యాసిడ్ బాధితుల ఉపాధి అవకాశాల కోసం పనిచేస్తున్న అంటోంది షాహీన్ మాలిక్. జాతీయ స్థాయిలో క్యాంపెయిన్  అగైనెస్ట్ యాసిడ్ అటాక్ ఇంచార్జ్ గా ఉంది షాహీన్ మాలిక్. యాసిడ్ బాధితులకు వైద్య సాయం మాత్రమే కాదు ఆర్థికంగా న్యాయపరంగా భావోద్వేగపరంగా మద్దతు కావాలి అంటుంది షాహీన్. యాసిడ్ అటాక్ తర్వాత అందవిహీనంగా మారిన నా మొహాన్ని ఎప్పుడు దాచుకోలేదు ఎవరు ఎలా చూసినా నా కంటిని నా మొహాన్ని ఎప్పుడు కప్పి ఉంచి నన్ను నేను ఎప్పటికీ ప్రేమించుకొంటాను అంటుంది షాహీన్ మాలిక్.

Leave a comment