చల్లగాలి తో ఈ సీజన్ లో అందరికీ ముక్కులు పట్టేస్తాయి. పగలు చల్లగానే వుంటుంది. ముక్కుదిబ్బడ చేస్తే నోటితో గాలి పీల్చుకొవలసి వస్తుంది. అప్పుడు గొంతు మంటగా పొడిగా అయిపోటుంది. దీనికి వేడి నీళ్ళు  మరిగించి, ఈ మరిగే నీళ్ళలో తులసి ఆకులు, వెల్లుల్లి పొట్టు, రెండు చుక్కల యుకలిప్టస్ ఆయిల్ వేసి ఈ ఆవిరిని పీలిస్తే ఉపసమనం కలుగుతుంది. ముక్కు దిబ్బడకి ఇది మంచి హామ్ రెమిడీ. ఈ ఆవిరి పట్టం వల్ల మొహం పై పేరుకున్న మురికీ జిడ్డు పోయి చర్మ రంద్రాలు తెరుచుకుంటాయి. ఆవిత్రి పట్టుకున్న వెంటనే మొహాన్ని చన్నీళ్ళతో కడుక్కోవాలి. ఈ ఆవిరి పట్టే ముందర, ముఖాన్ని పాలతో మసాజ్ లాగా చేస్తే, ఈ ఆవిరి తో మొహం మెరిసిపోతుంది కుడా.

Leave a comment