జీవితం లో తగిలిన ఒక్కో గాయం స్వర్ణలతకు బలమే ఇచ్చాయి. ప్రతి నైపుణ్యాన్ని ఒడిగ పెట్టింది. నాట్యం, పాట, ఈత లాంటి ఎన్నో కళాకారులతో పాటు పన్నెండు భాషలు నేర్చుకుంది. ఇంత నేర్చిన స్వర్ణలత ముల్టిపుల్ స్కిర్లోసిన్ బాధితురాలు. చక్రాల కుర్చికే పరిమితం మైన స్వర్ణలత జేవితం మాత్రం విశాలం. వికలాంగుల కోసం స్వర్ణ ఫౌండేషన్ స్థాపించింది. కాలం కూడ పట్టుకోలేని పక్షవాత బాధితులు బెంగుళూరు, పూణే, చెన్నై లోని విద్యార్ధులు కార్పోరేట్ సంస్థల ఉద్యోగుల కోసం వందల ప్రసంగాలు చేసింది. ఇద్దరు పిల్లల తల్లి స్వర్ణలత దివ్వాంగుల కోసం సారధి క్యాబ్ డిజైన్ చేసింది. తాగునీరు, మరుగుదొడ్డి వసతులున్న క్యాబ్లు ఇవి. దివ్వంగులకు వైద్యం, చదువు కోసం, ప్రభుత్వ ప్రేవైట్ సంస్థల్లో ప్రత్యేక వసతుల కోసం పోరాటం చేస్తూనే వుంది స్వర్ణలత.

Leave a comment