Categories
Nemalika

వాళ్ళతో కలిసిపోతేనే…..

నీహారికా,

చాల మంది తల్లి దండ్రులు కాంప్లెయింట్స్ చెప్పుతుంటారు. మా పిల్లలు మా కంటే వాళ్ళ ఫ్రెండ్స్ కే, ఫోన్ లేక్ ప్రాధాన్యత ఇస్తారని. కానీ మనం వాళ్ళలో వాళ్ళ స్నేహితుల్లాగా బిహేవ్ చేస్తున్నామా అన్న ప్రశాం వేసుకుంటే సమాదానం వెంటనే వస్తుంది. పిల్లలతో కలిసి ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి. కలిసి భోజనం చేయాలి. కనబడితే చాలు వాళ్ళ చదువు, ఫ్రెండ్స్ తిరుగుళ్ళు , వీటి గురించే అడగొద్దు. ఇప్పుడో ఒక సారి చదువు గురించి హెచ్చరిక చేయచ్చు. అదే పనిగా అవసరం ఏముంటుందీ. షికార్లు, సినిమాలు, క్రికెట్ మ్యాచ లు మనం తోనే కలిసి రావాలని విసిగించావద్దు. ఎదో ఒక సారి మన తో వుంటే చాలు. న్యాయంగా ఎవరి ఏజ్ గ్రూప్ తో వాళ్ళకి స్నేహం బావుంటుంది. టీనేజ్ పిల్లలకు తాము సరజ్ఞులమని ఓ భవన్ వుంటుంది. ఎం పోయింది వాళ్ళతో సమానంగా మనం వుంటే మనకి తెలియని ఎన్నో విషయాలు, కొత్త ఆవిష్కరణలు వాళ్ళకే తెలుసు. అవీ మనం తెలుసుకోవాలనుకొంటే వాళ్ళకే  తెలుసు. అవీ మనం తెలుసుకోవాలనుకుంటే వాళ్ళు మనం తో కుడా వుంటారు. మన అభిరుచులు వాళ్ళు నమ్మాలని  అనుకోవద్దు. వాళ్ళ అభిరుచులు మనం తెలుసుకుని వాళ్ళ కు దగ్గరవ్వాలని చూడొచ్చు కదా. ఏమంటావు.

Leave a comment