ఐదేళ్ల ఇండో-అమెరికన్ చిన్నారి కియారా కౌర్ రెండు గంటల్లో 36 పుస్తకాలు చదివి లండన్ వరల్డ్ రికార్డ్ ఆసియా రికార్డుల్లో తన పేరును చేర్చింది. చెన్నై కి చెందిన డాక్టర్ రవీంద్రనాథ్ కుమార్తె కియారా ప్రస్తుతం అబుదాబిలో ఉంది. లాక్ డౌన్ సమయం లో మొత్తం సమయాన్ని పుస్తకాలు చదవటం తోనే గడిపి వందల పుస్తకాలు చదివింది. ఇంటర్నెట్ లేకపోతే ఆన్ లైన్ లో బుక్స్ చదవలేము.చేతులో పుస్తకం ఉంటే ఎక్కడైనా ఏ ఇబ్బంది లేకుండా చదువుకోవచ్చు అంటుంది కియారా ఎంతో మంది పిల్లలకు మార్గదర్శి కావచ్చు.