Categories
ముఖ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. వాతావరణం లో వచ్చే ప్రతి మార్పుకు ప్రభావితం అయ్యేది ముఖ చర్మమే. చర్మానికి ఎప్పుడు సహజమైన నూనెలు అవసరం. కొబ్బరి ఆలీవ్ బాదం విటమిన్ ఇ ఇలా ఎదో ఒక నూనె ముఖానికి రెండ్రోజులకోసారైనా మర్దనా చేయాలి. చర్మం ముఖ కండరాలు ఉత్తేజకమవుతాయి. సహజ నూనెతో మర్దనా చేయటంతో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు అందుతాయి. సహజమైన మెరుపు ఉంటుంది. చర్మ కణజాలం ధృడపడుతుంది. నూనెతో మర్దనా వల్ల కందిపోవటం ,దద్దుర్లు రావటం చర్మం సాగిపోవటం వంటివి దూరమవుతాయి. ముఖ్యంగా విటమిన్ ఇ నూనెతో చర్మకణాలు పునర్నిర్మితమవుతాయి. ఇది అన్ని రకాల చర్మ తత్వాల వారికీ మేలు చేస్తుంది.