బ్యూటీ పార్లర్ కి వెళ్లాలన్నా సమయం ఉండదు. ఏ ఫేస్ క్రీమ్ వాడినా ఇంట్లో ఏదైనా చిట్కాలు ఉపయోగించినా పార్లర్ కు వెళ్లినంత చక్కగానే చర్మం మెరుస్తుంది . సహజమైన ఏ రసాయనాలు కలపని కొన్ని వస్తువుల్లో బ్లీచ్ కంటే మొహాన్ని తేటగా చేసే మంచి గుణాలుంటాయి. రెండు స్పూన్ల బియ్యం పిండి లో కొద్దిగా తేనె పెరుగు కలిపి ఈ మిశ్రమాన్ని మొహానికి మెడకీ మర్దనా చేసుకోవాలి. పావుగంటయ్యాక కడిగేసుకుంటే మురికి పోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. స్పున్ బియ్యంపిండి లో నాలుగైదు చుక్కల ఆముదం కలిపి కళ్ళ కింద పూతలా వేసి కడిగేసుకుంటే వలయాలు మడతలు క్రమంగా మాయం అవుతాయి. పాలు లేదా పాల మీగడలో కొద్దిగా బియ్యంపిండి కలిపి ఫెస్ ప్యాక్ వేసుకోవాలి. పది నిముషాల తర్వాత కడిగేస్తే మురికిపోయి చర్మం శుభ్రపడుతుంది. బియ్యం పిండిలో తేనె ఆలివ్ ఆయిల్ కలిపి స్నానానికి ముందు మర్దన చేస్తే మృతకణాలు పోయి ముఖం కళగా ఉంటుంది. బియ్యం పిండి మినపప్పు పిండి కలిపితే మంచి ఫేస్ ప్యాక్ అవుతుంది. ఇది తప్పకుండా ట్రై చేయచ్చు.
Categories
Soyagam

ఇది అద్భుతమైన ఫేస్ ప్యాక్

Leave a comment