అందంగా నున్నగా మెరిసే చర్మం ఏదైనా చిన్న మచ్చ కనబడ్డా కంగారు పడిపోతారు. అమ్మాయిలు. వీటిని కారణం సూర్య కిరణమే. ఆలా అని అసలు వాటిని వంటిపైన పడనీయకపోతే అనర్ధాలే ఎక్కువ. విటమిన్ డి ఉత్పత్తికి సూర్యకాంతి కావాలి. విటమిన్ డి లోపంవల్ల పసిపిల్లలకు ఎముకలు బలహీన పడతాయి. ఎముకల దృఢత్వానికి మంచి మూడ్ ను సరైన జీవక్రియకు విటమిన్ డి అవసరం. ఇది లోపిస్తే ఇన్సులిన్ ఫంక్షన్లు సరిగా ఉండక టైప్ -2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. విటమిన్ 2 సప్లిమెంట్లు ఉన్నా సరే సహజమైన సూర్యకాంతి శరీరానికి చాలా అవసరం. 90 శాతం విటమిన్ డి సూర్యకాంతి వల్లనే దక్కితేనే ఆరోగ్యం. కనుక సూర్య కిరణాలు అతిగా ఎక్స్ పోజ్ కాకుండా ఓ మోతాదులో ఎండా తాకిడిని ఉదయం సాయంత్రం వేళల్లో శరీరానికి తగాలనివ్వాలి. సన్ స్క్రీన్ లేకుండా పది పదిహేను నిముషాలు అదీ ఉదయం తొమ్మిది గంటల లోపు సాయంత్రం ఐదు తర్వాత సూర్య కిరణాలను శరీరానికి తాకనివ్వాలి.
Categories