ఆఫీస్ కు, అటునుంచి అటు ఏ పార్టీకొ వెళ్ళిపోవాలన్నా సౌకర్యంగా ఫ్యాషన్ గా వుండే జీన్స్ పైకి ఒక అందమైన టాప్ సరిపోతుంది అనుకుంటారు అమ్మాయిలు. ఫ్యాషన్ డిజైనర్లు ఈ డ్రెస్ ఓకే అంటారు కానీ కొన్ని కాంబినేషన్స్ ట్రై చేయండి బావుంటాయి అంటున్నారు. హోల్డర్ టాప్స్ వేసుకుంటే ఉదయం ఆఫీసుకు అటు నుంచి పార్టీకి వెళ్లిపోవచ్చు. దీని పైన కోట్ వేసుకుని ఆఫీస్ కు పొతే, వేడుక్కి వెళ్ళే ముందు ఈ కోట్ తీసేస్తే చాలు డ్రెస్ చాలా బావుంటుంది. అలాగే కఫ్తాన్ కూడా చెక్కని ఎంపిక. జార్జెట్, షిఫాన్, ప్రింట్లు, గానీ సిమెట్రికల్ గా అయినా ఎంపిక చేసుకుంటే దాన్ని మోకాలి వరకు వుండే జీన్స్, మడమ వరకు వుండే యాంకిల్ జీన్స్, స్కిన్నీ జీన్స్ తో పాటు ముచ్చటైన కాంబినేషన్ గా వుంటుంది. అలాగే స్కర్టులు, పరికిణీలు, పలాజో వంటి అన్ని రకాలకూ మ్యాచ్ అయ్యే క్రాప్ టాప్లు కూడా జీన్స్ నప్పుతాయి. చిన్న చిన్న వేడుకల కోసం లేస్ క్రాప్ బ్లవుజు సీక్వెన్స్ వున్న క్రాప్ టాప్ బావుంటుంది. ఇప్పుడు ఒకేలా కాకుండా ఇలా కాంబినేషన్ మారుస్తూ వుంటే న్యూ లుక్ తో చూడ చక్కాగా ఉంటారమ్మాయిలు.