అందమైన భారీ నగలు, భారీ భారీ సెట్టింగ్స్, గ్రాఫిక్స్ కలసి సినిమా ఇమాజ్ ను రెట్టించి చేస్తున్నాయనటంలో సందేహం లేదు. ఈ మధ్య కాలంలో చాలా సినిమాలకు కదను బట్టి దాని చరిత్రా నేపధ్యం, కాల పరిస్థుతులు ద్రుష్టిలో ఉంచుకుని అందుకు కావాల్సిన దుస్తులు, నగలు రూపొందిస్తున్నారు. సంజయ్, లీలా బన్సారీ దర్శకత్వంలో వహిస్తున్న పద్మావతి సినిమా కోసం కూడా ఇంత పరిశోధన జరిగింది. మిరమిట్లు గొలిపే సెట్టింగులూ, బరువైన నగలు, డ్రెస్సులు ముఖ్యంగా మహారాణి పాత్ర కోసం దీపిక ఆభరణాలు కళ్ళు జిగేలు మనిపిస్తున్నాయట . అలాగే అందమైన కాస్ట్యుమ్స్ బరువు కూడా ఇవన్నీ వేసుకుని కెమెరాల ముందు నటిస్తుంటే ఆ నగల బరువుకు దీపిక పదుకునే కు మెడ నొప్పి వచ్చెసిందట. మరి మహారాణి పాత్ర బరువు తో పాటు నగల బరువు కూడా మోయాలి కదా. ఈ కారణం చేత, ఎంతో నాజుకైన దీపిక కోసం సినిమా షూటింగ్ చాలా సార్లు వాయిదా పడిందిట మరి సినిమా కష్టాలు ఇలాగె ఉంటాయి.
Categories