Categories
Wahrevaa

రుచి ఆరోగ్యం ఉంటేనే ఏ వంటనయినా మెచ్చేది.

ఎన్నో దేశాల వంటకాలు రుచి చూస్తున్నాం గమనించండి. ప్రతి వంటకంలోను ఏవో పోషకాలు. ఆరోగ్యానికి మేలు చేసే అంశాలు, కోలెస్ట్రోల్ తగ్గించేవి, బరువు పెరగకుండా అదుపు చేసేవి, ఇలా ఎన్నో ప్రత్యేక అంశాలతోనే ఆ వంటకం పాప్యులర్ అవుతుంది. ఉదాహరణకు చైనా వంటకాలు నోరురిస్తాయి. వాటి ప్రత్యేకత కేవలం రుచికే పరిమితం కావు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వెల్లుల్లి అల్లం ఈ వంటకాల్లో ఎక్కువగా  కనిపిస్తాయి. వెల్లుల్లి గుండెకు మేలు చేస్తే అల్లం జీర్ణ సంబంధ సమస్యల్ని నివారిస్తుంది. ఈ రెంటినీ కొన్ని సెకెండ్ల పాటు వేయించి తీసుకోవాలి. చైనీస్ ఫ్లేవర్ డిష్, డిమ్ నమ్ ఆవిరి పైన వండేది. సూప్ లో పుట్టగొడుగులు, ఉల్లిపాయ ముక్కలు, చికెన్ ముక్కలు, తాజా కూరగాయలు వాడతారు. ఇవి పోషకాలు ఇస్తాయి. చిన్ని చిన్ని అనారోగ్యాలు దగ్గరకు రానివ్వవు. అలాగే పనీర్ వాడకాల కంటే చైనీస్ సోయా పనీర్ వాడతారు. ఇది పోషకాలు, మంసాకృతులు అందిస్తుంది. వివిధ దేశాల వంటలు, ఇలాగె పోప్యులర్ అవ్వుతున్నాయి.

Leave a comment