సందర్భానికి తగ్గట్టు దుస్తులు, నగలు తీసుకుంటారు. కానీ వేసుకొన్న దుస్తులకు తగినట్లు హ్యాండ్ బ్యాగ్ ఉంటేనే తీరుగా వుంటుంది అంటారు ఎక్స్ పర్ట్స్. శారీరాకృతికి తగ్గ హ్యాండ్ బ్యాగ్ వుండాలి. సన్నగా, పొడుగ్గా వున్న వాళ్ళు గుండ్రంగా బరువుగా వున్న బ్యాగ్ తీసుకోవాలి. అలాగే ఫోల్డేడ్ బ్యాగ్ వుండాలి. సన్నగా పొడుగ్గా వున్న వాళ్ళు గుండ్రంగా బరువుగా వున్న బ్యాగ్ తీసుకోవాలి. అలాగే ఫోల్డేడ్ బ్యాగ్లు, క్లచ్ రకాలు బావుంటాయి. వీలైనంత వరకు చిన్నవి వేసుకోకూడదు. అలాగే ఎత్తు తక్కువగా లావుగా వుంటే, పొడుగ్గా లేదా దీర్ఘచతురస్రాకారంలో పలుచగా వుండే బ్యాగులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎత్తు తక్కువగా వుండే వారికీ చిన్న రకాలే బావుంటాయి. నడుము భాగం లావుగా వుండే వాళ్ళకు హోబో బ్యాగ్ బావుంటుంది. చిన్ని పట్టిలున్న రకం కూడా తీసుకో వచ్చు. అలాగే హోల్డేడ్ బ్యాగ్ తీసుకుంటే దాని పట్టిలు కాస్త పొడుగ్గా వుండేలా చూసుకోవాలి. బాగా బొద్దుగా వుంటే చిన్న బ్యాగులను వేసుకోక పోవడం మంచిది. మరీ పెద్దవి కాకుండా మధ్యస్తంగా ఉండే బ్యాగ్ చెక్కగా సూట్ అవ్వుతుంది.

Leave a comment