ఖరీదైన రూమ్ ఫ్రెషనర్స్ కి తుగేలా వున్నాయి. అరోమా కోవోత్తులు. ఎన్నెన్నో సువాసనలతో వస్తున్న ఈ కొవ్వొత్తీ వెలిగిస్తే చాలు రూమంతా పరిమళం. మల్లెల మాసం కనుక మల్లె పువ్వులు పుష్కలంగా దొరుకుతాయి. కానీ అరోమాలో మల్లె సువాసన ఎంచుకుంటే మనస్సు ఉల్లాసంగా వుంటుంది. మల్లెలకుండే శ్వాసకోశ సమస్యల్ని అదుపులో ఉంచే శక్తితో చక్కని నిద్ర వస్తుంది. కోవోత్తులనుంచి వెలువడే లావెండర్ పరిమళం ఓత్తిడి, కున్గుబాటు, తలనొప్పి నుంచి తక్షణ ఉపసమనం ఇస్తుంది. దాల్చిన చక్క పరిమళం ఇచ్చే కోవొత్తితో ఏకాగ్రత పెరుగుతుంది. ఇక గులాబీ సువాసన అయితే ఏ సాయంత్రమో బంధువులతో, స్నేహితులతోకుర్చుని కబుర్ల తో గడపాలంటే చుట్టూ స్నేహ పరిమళం వేదజల్లునట్లే వుంటుంది. ఇక నిమ్మగడ్డి వాసన వచ్చే కోవొత్తి వెలిగించి పెడితే దోమలు కనబడకుండా పోతాయి.
Categories