జుట్టు స్ట్రెయిట్ గా వుంటే ఇలాంటి అలంకరణలైనా చేయొచ్చు. అలా స్ట్రెయిట్ గా వుంచడం కోసం, జుట్టు పెరుగుదల కోసం, ఆరోగ్యం కోసం కొబ్బరి పాలు ఎంతో బాగా ఉపయోగ పడతాయి. కొబ్బరి పాలు తీసి దాన్ని జుట్టు కుదుళ్ళ వరకు పట్టించి ఓ అరగంట పాటు వదిలేసి ఆ తర్వాత మైల్డ్ షాంపూ తో స్నానం చేస్తే జుట్టు స్ట్రెయిట్ గా మెరుపులీనుతూ కనిపిస్తుంది. రెండు చెంచాల బియ్యం పిండి, అరకప్పు ముల్తానీ మట్టి గుడ్డులో తెల్ల సోన కలిపి దానికి నీళ్ళు కలిపి తలకు హెన్నా లాగా అప్లయ్ చేయాలి. ఓ అరగంట తర్వాత షాంపూ తో తలస్నానం చేయాలి. తెల్ల సోన ముల్తానీ మట్టి జుట్టుకు మెత్తదనం తో పాటు నిగారింపుగా చేస్తాయి. రెండు గుడ్లలోని తెల్ల సోన తీసుకుని బాగా గిలకొట్టాలి. అందులో రెండు చెంచాల ఆలివ్ ఆయిల్ కలపాలి తలస్నానం చేసి పొడిగా వున్న జుట్టుకు ఈ మిశ్రమాన్ని పట్టించి అరగంట పోయాక స్నానం చేస్తే జుట్టు స్ట్రెయిట్ గా మెత్తగా వుంటుంది.
Categories