Categories
Nemalika

ఇబ్బంది పెట్టే గాసిప్స్ వినొద్దు.

నీహారికా,

ఈ గాసిప్స్ ఏమిటీ? వీటిని కేర్ చేయాలా అన్నావు, మనుష్యులు ఎక్కడుంటే అక్కడ గాసిప్స్ తప్పవు. కమ్యూనికేషన్ కు ఇదొక పాత పద్ధతి లాంటిది. కొద్ది మోతాదు దాకా గాసిప్స్ సహజం హానికరం కావు. కానీ కొన్ని మనసుని నొప్పించే గాసిప్స్ హింస లాంటివి. వీటిని విజయవంతంగా ఎదుర్కొనే నైపుణ్యం కావాలి. ఆఫీస్ గాసిప్ లనయితే వర్క్ ప్లేస్ రియాలిటీ గా భావించాలి. ఇవి విశ్వమానవ ప్రవర్తనలో భాగం. స్త్రీ పురుషులిద్దరూ ఈ గాసిప్స్ ను ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ గాసిప్స్ పరిధి దాటకూడదు. కొలీగ్స్ గురించి ఏదో అనేసి తర్వాత పశ్చత్తాప పడితే ప్రయోజనం ఉండకపోవచ్చు. హానికరమైన గాసిప్స్ కు దూరంగా ఉండాలి. వినే వాళ్ళు ఉంటేనే కదా చెప్పేవాళ్ల పని వీలైతే అలాంటివి ఖండించాలి లేదా పూర్తిగా దూరంగా ఉండాలి. స్నేహితులకు కోలీగ్స్ కు నడుమ తేడా వుంటుంది. వ్యక్తిగత జీవితాన్ని ఆఫీసుకు తేవడం అంటే విపత్తుకు రిసీవ్ లాంటిదని అర్ధం. ఆఫీసులో ఫ్రెండ్లీ గా ఉండొద్దని కాదు వ్యక్తిగత జీవితానికి సబందించి సున్నితమైన విషయాలను షేర్ చేయకపోవడం మంచిది. వ్యక్తిగత, వృత్తిగత జీవితాల మధ్య ఒక పొరను గీసుకోవాలి.

Leave a comment