Categories
WhatsApp

నాలుగైదు సర్వింగ్స్ ఆరోగ్యం.

కడుపు నిండా తినడం అన్న కాన్సెప్ట్ ఎప్పుడో పోయింది. ప్రతి ఫుడ్ గ్రూప్ నుంచి కొన్ని సర్వింగ్స్ తీసుకుంటే ఆరోగ్యం అని చెప్పుతున్నారు డైటీషియన్లు. ఆహార సమతుల్యంగా వుండాలి. నాలుగైదు సెర్వింగ్స్ బ్రౌన్ రైస్, హోల్ వీట్ లేదా మరే ఇతర ధాన్యాలు అంటే రాగి జొన్న లేదా పాస్తా ల తో కూడిన కాంప్లెక్స్ కార్బోహైడ్రేడ్స్ అవసరం. రెండు సెర్వింగ్స్ పండ్లు, నాలుగు సెర్వింగ్స్ ప్రోటీన్ పదార్ధాలు తినాలి. శాఖాహారులైతే ప్రోటీన్లు అధికంగా వుండే సూపర్ ధాన్యాలు ఆహారంలో వుండే విధంగా జాగ్రత్త పడాలి. డైట్ చార్ట్ ను అనుసరించి పరిమితంగా వుండే సెర్వింగ్స్ తో ఆరోగ్యంగా ఉండవచ్చు అని నిపుణుల సూచన.

Leave a comment