చాంద్ బాలీ  బుట్టలకు ఎప్పటికీ ఆదరణ తగ్గదు. మొఘులుల కాలం నాటి ఆభరణాలలో ఈ చాంద్ బాలీలు ప్రత్యేకం విభిన్న డిజైన్ల తో కొత్త అందాలలో ఇవ్వాల్టి అమ్మాయిలకు ఫస్ట్ ఛాయిస్ అనిపిస్తాయి. విదేశీ మహిళలని సైతం ఆకర్షించే ఆ చాంద్ బాలీలు అర్ధ చంద్రాకృతిలోనే మధ్యలోను కింద రకరకాల బుట్టలోలాకుల్ని జోడించుకుని వస్తాయి. అచ్చంగా వజ్రాలు పొదిగిన వాటియ్హో పాటు కుందన్, మీనాకారీ టెంపుల్ జ్యూవెలరీ డిజైన్ లలోనూ వీటిని తయ్యారు చేస్తున్నారు. సిల్క్ దారాలు, పూసలు బ్లాక్ మెటల్ అక్సిడైజ్డ్ సిల్వర్ వంటి ఇతరాత్రా ఫంకీ డిజైన్ నగల్లో కూడా ఆ చాంద్ బాలీ లే తెగ సందడి చేస్తున్నాయి.

Leave a comment