చర్మానికి తేమ మెరుపు ఇస్తుంది టోనర్ .ఈ టోనర్ ను జాగ్రత్తగా ఎంచుకోవాలి. జిడ్డు చర్మం  ఉన్న వారు తేలికగా ఉండి నూనె సంబంధిత పదార్థాలు లేని టోనర్ ను తీసుకోవాలి.సున్నితమైన చర్మం ఉంటే సాలిసిలిక్ ఆమ్లం అధికంగా ఉండే టోనర్ ఉపయోగించాలి.అయితే పారా చేన్స్ ఉన్న టోనర్ వాడకూడదు. చర్మం పైన మచ్చలు ఉంటే ఆల్కహాల్ లేని, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ ఉన్న టోనర్ వాడాలి.సహజమైన టోనర్ కావాలి అనుకుంటే అలోవెరా రోజ్ వాటర్ కలిపి వాడుకోవచ్చు.అలాగే అలోవెరా లో గులాబీ పూల గుజ్జును  కలిపి టోనర్ గా వాడుకోవచ్చు.ఈ హోం మేడ్ క్లిన్సర్స్ చర్మాన్ని మెరుపు తో ఉంచుతాయి.

Leave a comment