వారానికి ఒక సారి ఉపవాసం చేస్తే బరువు తగ్గుతామనే బ్రమలో ఉంటారు చాలా మంది. బరువు తగ్గడానికి ఉపవాసం ఏ విధంగానూ సహకరించదు. ఉపవాసం సరిగా చేయగలిగితే శరీరక వ్యవస్థలోని విషతుల్యాలు బయటకు వెళ్ళిపోతాయి. ఉపవాస దీక్షలో వుంటే పండ్లు తినడం, జ్యూస్లు తాగడం వంటివి చేస్తే టాక్సిన్ లు వెలికి పోతాయి. ఉపవాసం బరువు పై తాత్కాలిక ప్రభావం చూపెడుతుంది. అదీ వారాల కొద్దీ చేసినా బరువు తగ్గడం కోసం ఉపవాసం చేపట్టడం సరైన చర్య కానేకాదు. ఇలా ఉపవాసాలు చేస్తే అత్యవసరమైన పోషకాలను శరీరం కోల్పోతుంది. బరువు తగ్గేందుకు తీసుకునే డైట్ ను డైటీషియన్లు సూచించినట్లు తీసుకుంటే శరీరాక్రుతికి తగిన ఎక్స్ పార్ట్స్ సూచించిన రీతిలో వ్యాయామాలు చేస్తే కొద్ది కాలానికి బరువు తగ్గడం మొదలవ్వుతుంది. ఏ ప్రక్రియ వేగంగా జరిగిపోదు.
Categories