Categories
WhatsApp

ప్లాస్టిక్ వాసన పోతుందిలా.

ఈ కాలంలో అన్నీ ప్లాస్టిక్ సామాగ్రే. చిన్నపిల్లల టిఫెన్ బాక్స్ ల నుంచి సరుకులు పోసి పెట్టుకునే డబ్బాల వరకు సర్వం ప్లాస్టిక్ మాయం. కొన్ని ప్లాస్టిక్ వస్తువులు ప్లాస్టిక్ వాసన వస్తాయి. వాటిని ఉపయోగించే ముందు బకెట్ వేడి నీళ్ళల్లో మూడు చంచాల వంట సోడా వేసి ఆ నీటిలో ప్లాస్టిక్ వస్తువులని పడేయాలి. అరగంట తర్వాత బయటికి తీసి శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. భోజనం పెట్టే డబ్బా నుంచి జిడ్డు, అందులో ఉంచిన పదార్దాలకు సంబందించిన వాసన వస్తుంటే బకేట్ నీళ్ళలో పావు కప్పు వెనిగర్ అరచెక్క నిమ్మరసం వేసి కలపాలి. ఆ నీళ్ళలో డబ్బాలు పడేసి పది నిముషాల తర్వాత తీసి కడిగేస్తే చాలు, పదార్ధాల తాలూకు వాసన పోతుంది. అలాగే డబ్బాలపై మరకలను సబ్బు నీళ్ళలో నిమ్మచక్క పడేసి ఆ చక్కతోనే తోమేస్తే నిమ్మలోని పులుపు వల్ల మరకలు పోతాయి. తర్వాత బాగా కడిగి పొడి గుడ్డతో తుడిస్తే కొత్త వాటిలా మెరుస్తాయి.

Leave a comment