ఒక సినిమాలో హీరో అర్జున్ ఒక్కరోజు ప్రధానిగా అవాకసం తీసుకుని ఆ ఒక్క రోజే ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసేస్తాడు. అలాగే ఇప్పుడు బెల్లా అనే ఐదేళ్ళ పాప కూడా కెనడా దేశానికి ఒక రోజు ప్రధానిగా వ్యవహరించాబోతుంది. కెనడా కు చెందిన సిబిసి కిడ్స్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇటివల ఒక పోటీ నిర్వహించారు. పీ.ఎం ఫర్ ఎ డే అనే పేరుతో నిర్వహించిన ఈ పోటీలో ధంప్సన్ కు చెందిన ఐదేళ్ళ చిట్టి పాప బెల్లా విజయం సాధించింది. ఒక ప్రధానిగా, ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు వుండేలా అందరు సురక్షితంగా ఉండేలా చూస్తాను. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా అలింగనం చేసుకుంటాను. మన చుట్టూ జంతువులు, ఈ ప్రపంచం క్షేమమంగా ఉండేలా పనిచేస్తాను. ప్రతి కెనడియన్ ఆరోగ్యంగా ఉండేలా చూస్తానని చెప్పి ఒక్కరోజు ప్రధానిగా ఎంపికైంది బెల్లా.

Leave a comment