విధి నిర్వహణలో క్వాలిటీ అఫ్ లైఫ్ అంటే ఇదీ అని నిరుపించిన మహిళ, భారతదేశ తోలి మహిళ ఐపి.ఎస్ అధికారి కిరణ్ బేడి. రామన్ మేగ్ సేసే వంటి అత్యుత్తమ అవార్డులు అందుకొన్నారు. బ్యూరో అఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్ హోదాలో 2007 లో స్వచ్చంధ పదవీ విరమణ పొందారు డాక్టర్ కిరణ్ బేడీ 1949 జూన్ తొమ్మిదిన అమృత్సర్ లో జన్మించారామె. 9000 మంది ఖైదీలున్న తిహార్ జైలు అధికారిగా చేసి ఎదురులేని మన్ననలు పొందారు. చండీగడ్ లెప్టినెంట్ గవర్నర్ సలహాదారుగా చేసారు. ఐక్యరాజ్యసమితిలో పని చేసారు. సామాన్య ప్రజలతో మమేకం అవ్వటం కోసం ఓపెన్ డోర్ పద్దతిని ప్రతి నియోజిక వర్గంలో బీట్ బాక్స్ ప్రవేశ పెట్టి సంచలనం సృష్టించారు. పదవీ విరామాణ తర్వాత నవజ్వాల ఫౌండేషన్, ఇండియా విజన్ ఫౌండేషన్, స్వచ్చంద సంస్థ స్థాపించి సేవలందిస్తున్నారు ప్రస్తుతం లిప్ట్ నేంట్ గవర్నర్ గా వున్నారు. ఐడేర్ పేరుతో వచ్చిన ఈమె ఆత్మకధ సంచలనం.
Categories