వాస్తవాలు వినేందుకు కతినంగా ఉంటాయి. ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే  ఎంతో మందితో వినయంగా మెలగాలి. మనస్సు లో మాట అలాబయటికి చెప్పకూడదు. లౌక్యంగా వ్యవహరించక  పొతే కంగనా కు ఎదురైనా అనుభవమే అందరిదీ. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్. ఆమెకు ఎంతో డిమాండ్ వుంది. ఎంతో మంది దర్శక నిర్మాతలు ఆమె కోసం క్యు కడతారు. కానీ రెమ్యునరేషన్ విషయంలో మిగతా హీరోయిన్స్ కంటే తక్కువే ఇస్తారట. ఆమె ప్రతి విషయాన్ని ఘాటుగా విమర్శించడం, ఓపెన్ గా వుండటం ఎవరికీ నచ్చదు. నోరేక్కువా అనే కితాబే ఆమెకు వుంది. అలాగే ఆమెకు పారితోషకం కుడా తక్కువే. నా ఆదాయం తక్కువే కానీ డిమాండ్ మాత్రం ఎక్కువే. బోలెడన్ని సినిమాలు చేస్తున్నాను. కాకపొతే లౌక్యంగా వుండటం వల్ ఆదాయం తగ్గింది అయినా నాకేం సమస్య లేదు అంటుంది కంగనా.

Leave a comment