నీహారికా, మనసు నిండా పేరుకున్న అనవసరపు చెత్తను తీసేస్తేనే జీవితం సంతోషంగా, సుఖంగా సాగుతుందిట. అంటే ఇల్లంతా చిరాగ్గా వుంటే, ఇరుగ్గా అనిపిస్తే ఎలా తోచుబడి కాదో అలాగే ఎమోషనల్ బ్యాగేజ్ వల్ల కూడా అంతే దిగులు డిప్రెషన్ ఆవరిస్తాయి. వీటిని తొలగించుకొనేందుకు కొన్ని సూత్రాలు పాటించాలి. కొందరి పట్ల వ్యక్తిగత కోపాలు ద్వేషాలు మానవ సహజం. అలాగే మనపట్ల కూడా కొందరు కోపం ద్వేషంతో వుండొచ్చు. ఈ వ్యతిరేక భావన వల్ల ముందు మన ప్రశాంతత పోతుంది. దీన్ని పోగొట్టుకోవడం కోసం ఎక్స్పర్ట్స్ ఒక పరిష్కారం చెపుతున్నారు. ఒక ఇ-మెయిల్ ఐడి సృష్టించుకుని మనం నొచ్చుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ లెటర్ వ్రాసి తర్వాత దాన్ని డిలీట్ చెయ్యాలి. దీనివల్ల మన మనసులో నొక్కి పెట్టిన భావాలు పోతాయి. అలాగే మనం ఎవరినైనా నొప్పించినా వెంటనే నిర్మొహమాటంగా సారీ చెప్పేయాలి. అప్పుడే మనసు తేలికవుతుంది. మెయిల్ ఐడి కుదరని పక్షంలో ఒక ఉత్తరం రాసి దాన్ని చించేసినా సరే మనసుకు ఆవరించిన విసుగు, డిప్రెషన్ పోతాయి.
Categories