Categories
కొన్నప్పటికంటే రెండు మూడు సార్లు వుతగ్గానే దుస్తులు షేడ్ అయిపోతాయి. ఆ కొత్తదనం చూడమన్నా కనిపించదు. జీన్స్ కొన్నప్పటి రంగులో ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు వాష్ చేసే సమయంలో జీన్స్ తిరగేయడం వల్ల కలర్ డార్క్ గా కొత్తగా వుంటుంది. జీన్స్ దళసరిగా ఉంటాయి కనుక ఆరవని ఎండలో ఆరేస్తు ఉంటారు. దీని వల్లనే కలర్ వేలిసిపోతుంది . కనుక ఆలస్య మైన నీడలోనే అరనివ్వాలి. జీన్స్ కలర్ షెడ్ అయి ఆడ్ గా కనబడినా సరే వాటికి రంగు వేయించాఅలనుకోవద్దు. దీని వల్ల కొత్తగా కనిపించే బదులు మురిగ్గా కనిపిస్తాయి. చల్లని నీళ్ళలో జీన్స్ వాష్ చేయాలి. పౌడర్ డిటర్జెంట్స్ వాడకూడదు. ఇవి వాడటం వల్ల ఫ్యాబ్రిక్ షేడవుతుంది.