గర్భం ధరించినపుడు పెరిగే బరువు గురించి ఎక్కువ ఆందోళన పడుతుంటారు. అప్పటివరకు మెయిన్ టైన్ చేసిన శారేరం ఆకృతి మర్చుకొంటుంది. ఈ విషయం గురించి గర్భిణి స్త్రీలు ముందు ఆందోళన తగ్గించుకోవాలి. గర్భం ధరించినపుడు బరువు పెరగడం అనేది సర్వ సాధారణమైన విషయం, పైగా ఆరోగ్యవంతం కూడా. గర్భంలో పెరిగే బిడ్డ గురించి పోషకాహారం తీసుకోవడం తల్లి బిడ్డ ఆరోగ్యంగా వుండటం చాలా అవసరం. ప్రసవం జరిగాక బరువు తగ్గే ప్రయత్నాలు చేయవచ్చు. తర్వాత యధాప్రకారం పూర్వపు ఆకృతి వచ్చేస్తుంది కూడా. మొదటి ఆరు నెలలు బిడ్డకు పాలిచ్చే క్రమంలో బరువు శీఘ్రంగానే తగ్గిపోతుంది కూడా. ప్రసవించిన ఆరు వరాల తర్వాత నుంచి వ్యాయామం మొదలు పెట్టుకోవచ్చు. కాబట్టి గర్భిణిగా వున్నా సమయంలో పెరిగే బరువు గురించి హాయిగా ఎదురు చూడటం మంచిది.
Categories