Categories
WhatsApp

ఈ వస్తువుల్ని శుబ్రం చేస్తున్నారా?

ఇంట్లో వాడుకొనే కొన్ని వస్తువులు అందంగా వున్నాయో, గదికి అందం ఇచ్చాయో లేదో చూసుకుంటాం కానీ వాటిని శుబ్రం చేసే విషయంలో కొంత అలక్ష్యం చేస్తాం. ఉదాహరణకు దిండ్లు లేకుండా దాదాపు అందరికి నిద్రపట్టదు. దిండు గాలేబులను మార్చేస్తాం. కానీ మరి దిండు సంగతి ఏమిటి? కనీసం సంవత్సరానికొసారిదిళ్ళు మార్చేయాలి. రెండురోజులకోసారి ఎండలో ఉంచాలి. అలాగే వీలైతే నెలకోసారి వాటిని ఉతకాలి. అలాగే దుప్పట్లు కూడా ప్రతి వారం ఉతకాలి. అది కూడా వేడి వేడి నీళ్ళల్లో ముంచి ఉతికి ఎండలో ఆరేయాలి. పరుపులు వ్యాక్యూమ్ క్లీనర్ తో ఆరు నెలకోసారి శుబ్రం చేయాలి. దుమ్ము పోతుంది. నేలకోసారైనా ఎండలో పడేసి దులిపి మళ్ళి కొత్త కవర్ తోడుక్కోవాలి. కార్పెట్స్ బావున్నాయి కదా అని అలా వదిలేస్తే అవే సగం ఎలర్జీలకు కారణం అవుతాయి. ఆరునెలకొసారైనా వ్యాక్యూమ్ క్లీనర్ తో డస్ట్ దులీపి వేసుకోవాలి. ఇక జీన్స్ విషయానికొస్తే ఉతకడం కష్టం అని పదిసార్లు వేసుకుంటే నష్టం రేణు సార్లు వేసుకుని వెంటనే ఉతికి ఆరనివ్వాలి.

Leave a comment