Categories
సంగీతం ఎవరినైనా అలరిస్తుంది. సంతోషాన్ని ఇవ్వడం లో సంగీతానికి ప్రధాన పాత్ర అని ముక్త కంఠంతో చెప్పేవారు ఎందఱో వున్నారు. కొత్త పరిశోధనలు సంగీతం వల్ల ఇంకో కొత్త ప్రయోజనం వుందని తేల్చారు. సంగీతం బుర్రను పాదరాసంగా చేయగలుగుతుందిట. అంటే ఏకాగ్రత పెంచుతుంది. సంగీతం వినిపిస్తూ మానసిక ఏకాగ్రత వ్యాయామాలు చేయించినప్పుడుఎంతో అనుకూల ఫలితాలు గుర్తించారు. మంచి మూడ్ ను, చురుకుదనాన్ని అనుభవదేరాలను సంగీతం సృష్టిస్తుంది. చక్కని సంగీతాన్ని వీనుల విందు గా వినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. అలాగే కొన్ని రకాల సంగీత స్వరాలు కొన్ని నరాల పై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయని శరీరానికి స్వాంతన ఇవ్వగల శక్తి సంగీతంతో అనారొగ్యాలు మాయం చేస్తున్నారు కూడా.