Categories
Nemalika

నలుగురిని కలుపుకు పోగలిగితే చాలు

నిహారిక, లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఎవరికీ పుట్టుకతోనే వచ్చి తీరాలని రులెంలేదు లీదెర్ గా ఎదగాలంటే సామర్థ్యం, ప్రతిభ అలవర్చుకునేవి కూడా. అలాగే నేను కోరిక ముఖ్యం. ఎన్నో సవాళ్ళని స్వీకరించి తమకు తామే నిరూపించుకోవాలి. అలాగే మనలో ఎంత నైపుణ్యం ఉన్న సరే మన చుట్టూ ఉన్న బృందం లోని నైపుణ్యాలను గుర్తించి వాళ్ళ దగ్గర ఏ సాయం తీసుకోవచో తెలుకోగల తెలివితేటలూ ఉండాలి. ఒక బృందంలో నాయకురాలిగా ఎదగాలంటే ముందర అందరిని కలుపుకుపోగల చానచక్యం ఉండాలి. అందరిచేత పని చేయిస్తు, మనము పని చేస్తూ , సమిష్టిగా అభివృద్ది సాదించాలి. ఒక లక్ష్యం సాదించాలి అంటే ఆ లక్ష్యానికి కొన్ని నిబంధనలు కట్టుబాట్లు ఉంటాయి. అవి ఎప్పటికి మారక్కర లేదు గానీ, కొన్ని చిన్న చిన్న మార్పులు అవసరమైతే వాటిని మార్చుకొంటూ మార్పులు రావాలి. ఎ రంగంలో ఐనా పూర్తిస్థాయి పరిపూర్ణత ఎవ్వరికి ఉండదు.అన్ని విషయాలు అందరికి తెలియక పోవచ్చు. ఎప్పటికి షేరింగ్ ముఖ్యం. మన భావాలూ, ఆశయాలు, అభివృద్ధి క్రమం అందరితో చర్చిస్తూ ఆచరణ యోగ్యమైనవి ఆచరించుకుంటూపోతే నాయకత్వ పగ్గాలు అవే చేతికి వస్తాయి.

Leave a comment