నీహారిక,
మంచి లీదెర్ షిప్ లక్షణాలు ఏమిటి అని అడిగితే కెరీర్ లో ఎదగాలన్న, జీవితంలో పెద్ద లక్ష్యాలు అందుకోవాలన్న కొంత కమాండింగ్ దృక్పథం కావలి. అందుకు కావలసిన తోలి ఆయుధం గొంతు. స్ట్రాంగ్ టోన్ ఎదుటివారి దృష్టిని ఇట్టే ఆకర్షిస్తుంది. ఎవరైనా  మన గ్రూప్ లో అడ్రస్  చేసి మాట్లాడవలసి వస్తే పోశ్చర్ స్ట్రెయిట్ గా ఉండాలి. ముందుకు వంగిపోయీ గానీ, పక్కకు వంగి కానీ మాట్లాడకూడదు. చక్కని బాడీ లాంగ్వేజ్ తో మరింత పవర్ ఫుల్ గా ఉంటుందని అనేక మంది మానసిక నిపుణులు చెప్తున్నారు. అలాగే వస్త్ర్హ ధారణలో కూడా ఏదో ప్రతేక్యత ఉండాలి. ఒక వైవిధ్యం కనిపించాలి. మాటల్లో ఎమోషన్స్ పలకాలి. మంచి మాటలు మాట్లాడాలి. అలా మాట్లాడాలంటే మంచి నాలెడ్జీ కావలి. చక్కని పరిజ్ఞానం, చక్కని ఉచ్చారణ, ఒక విషయాన్ని వివరించడంలో కొత్తదనం ఇవన్ని అలవరుచుకుంటే నాయకురాలి లక్షణాలు వచ్చేసినట్లే. చక్కగా చేతుల కదలిస్తే గొంతులో సరైన మాడ్యులేషన్ తో మాటలు పలికిస్తే తప్పకుండా లీదెర్ అనిపించుకుంటారు.

Leave a comment