ఆరోగ్యం విషయంలో లెక్కలేనన్ని అధ్యయనాలు జరుగుతుంటాయి. ఇటివల కొన్ని వందల మంది పై నిర్వహించిన ఒక అధ్యయనంలో క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఆలోచన శక్తి పెరగుతుందని తేలింది. 22 నుంచి 66 సంవత్సరాల లోపు ఉన్న 140 మంది పై ఈ అధ్యాయనం సాగింది. వీరికి గతంలో అనారోగ్యాలు ఏవీ లేవు. అధ్యయనం మొదలు పెట్టే సమయానికి వారికి వ్యాయామం చేసే అలవాటు లేదు. ఆరు నెలల పాటు వీరి చేత వ్యాయామం చేయించారు. గడువు ముగిసే వరకూ వీరి మెదడు పనితీరు రికార్డు చేశారు.గతంలో కన్న మెదడు చాలా చురుగ్గా పని చేస్తున్నట్లు రికార్డు అయ్యింది. ఆలోచన పరిధి పెరిగింది.

Leave a comment