Categories
దంతాలపై ఎనామిల్ ను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇందుకోసం ఎనో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే ఎనామిల్ పొతే ఇంకాస్త ఎక్కువ శ్రద్ధ అవసరం. సోడాలు ఎనర్జీ డ్రింకు లు, స్పోర్ట్స్ డ్రింక్స్ వంటి ఎసిడిక్ పానీయాలు తాగకూడదు. సిట్రస్ జ్యూస్ లు కుడా మంచివి కాదు. ఆరెంజ్, నిమ్మ, ద్రాక్ష వంటివి సిట్రస్ పండ్లని ఇతర పదార్దాలతో కలిపి తీసుకోవాలి. ఎసిడిక్ పదార్దాలు గానీ పానీయాలు కానీ తీసుకుంటే నోటి లో పుక్కిలించి కడుక్కోవాలి. డైరీ ఉత్పత్తుల వాళ్ళ కాల్షియం తగినంతగా దొరుకుతుంది కనుక పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. నోటిలో లాలాజలం ఉత్పత్తిని పెంచుకోనేందుకు షుగర్ లెస్ చూయింగమ్ని నములుతూ వుండాలి. మృదువైన బ్రష్ తో పళ్ళు తిముకోవాలి. బ్రషింగ్ ఎక్కువ సేపు చేయకూడదు.