Categories
ఇప్పుడు ఎనర్జీ డ్రింక్స్ చాలా మందికి అలవాటు. రన్నింగ్ వర్కఉతస్ చేసాక ఓ లాంటి ఎసిడిటీ అనిపిస్తూ వుంటుంది. ఇది ఎనర్జీ డ్రింక్ ల కారణమా అని ఓ ఆలోచన వస్తు వుంటుంది. పరిశోధనలు ఏం చెప్పుతున్నాయి అంటే ఎనర్జీ జేల్స్ కార్బోహైడ్రేడ్స్ ఆధారం కనుక ఎసిడిటీ ని కలిగించవు. బహుశా కాఫీ తాగడం వల్ల ఉదరం లైనింగ్ ను ఇరిటేట్ చేస్తుందని అనుమానం వ్యక్తం చేసారు. అంచేత ఉదయాన్నే రన్నింగ్ కు ముందు అరటి పండు లేదా యాపిల్, దానితో పాటు అలోవీరా జ్యూస్ తాగితే ఈ ఇబ్బంది రాదంటారు. అలోవీరా లో వుండే సహజ యాంటాసిడ్ గుణాలు ఈ సమస్యను పోగొడుతుంది. అయితే రన్నింగ్ కు అరగంట ముందే ఏదయినా తినాలి.