నీహారికా,

ఎంతో మంది మనకు కలుస్తూ, స్నేహ పరిధి లోకి వస్తూ ఉంటారు. అందరితో ఒకే రకమైన స్నేహం ఉండక పోయినా ఒక్కొక్కలతో ఒక్కో బావోద్వేగిత సంబంధం ఉంటుంది. కానీ మనం చేసే స్నేహాలన్నీ స్వచ్చందంగా వస్తున్నాయా? కొందరు చాల ప్రశాంతతను తెస్తారు. మరి కొందరి స్నేహం పస్తులే ఇస్తుంది. అయిష్టమైన చర్యలు, కబుర్లు, అర్థం లేని విమర్శలు వస్తాయి. అలాంటప్పుడు ఆ స్నేహాన్ని దూరం పెట్టాలి. మనము చేయగలిగింది ఏమి ఉండదు. ఎలా ఆ పని జరిగేది. ముందుగా మన సమయానికో విలువ ఉంటుంది. దాన్ని స్నేహితుల కోసం వెచ్చిస్తాం. కనుక స్నేహితులతో ఉండే సంబందాలను సమీక్షుంచుకోవచ్చు. ఎదుటి వాళ్లకు స్నేహంతో కాక, అవసరాలకు ఉపయోగ పడుతున్నారనే అభిప్రాయం కలిగితే అప్పుడు క్షణం ఆగి ఆ వ్యక్తుల పైన మిగతా స్నేహితుల స్నేహితుల అబిప్రాయం పనిలో తెలుసుకోవటం చాలా అవసరం. ఒక వేల మన అనుమానం నిజమైతే ఆ స్నేహం అంత విలువైంది కాదని తేలితే ఆ స్నేహం తో నెమ్మదిగా ఇవతలకు రావటం బెస్ట్. ఉన్న కాస్త సమయాన్ని ఇతరుపైన వృధా చేయటం కన్నా అనవసరమైన మానసిక వత్తిడి తెచ్చుకోవడం కన్నా  వదిలించుకొని ఇవాతలకు రావటమే మంచిది. ఎవ్వరితోను కలుపుగా వ్యవహరించంక్కర్లేదు. పరిమితమైన సంబందాలను ఎంపిక మన చేతుల్లోనే ఉంది.

Leave a comment