వ్యాయామం మనం గాలి పీల్చినంత అవసరం తప్పని సరిగా ఇంట్లోనే, జిమ్ లో చేయవలసిందే. చర్మ సౌందర్య నిపుణులు ఏం చెప్పుతున్నారంటే వ్యాయామ పరికరాలు ఉపయోగించే సమయం జాగ్రత్త. ఆ పరికరాలతో పని చేసి ఆ ప్రదేశంలో చెప్పులు లేకుండా నడిస్తే బాక్టీరియా, వైరస్ ల బారిన పడతారని ముందు శుబ్రంగా మొహం కడుక్కుని తర్వాత జిమ్ లో నైనా సరే వ్యాయామ పరికరాలను, మన దగ్గర వుండే టవల్ శుబ్రంగా తడి చాకే ఉపయోగించాలి. కింద కుర్చుని చేసే వ్యాయామాలకు మనం ఇంటి నుంచి తీసుకు వెళ్ళిన టవల్ పరుచుకుని కూర్చోవాలి. వ్యాయామంలో విడుదలయ్యే చమట చర్మంపై పగుళ్ళకు కారణం అవ్వుతుంది. వదులుగా వుండే బట్టలు వేసుకుని వ్యాయామం చేయాలి. మేకప్ తీసేసి వ్యాయామం చేయాలి. ముందుగా యాంటీ ఫంగల్ పౌడర్ శరీరానికి చుట్టుకుని మరీ జిమ్ కు వెళ్ళితే మంచిది.
Categories