ఫెంటీ బ్యూటీ పేరుతో లిప్ స్టిక్ లు ,లోదుస్తులు విడుదల చేసింది రిహానా. బిజినెస్ ఉమెన్ గా ,గాయనిగా,డాన్సర్ గా, పాటల రచయిత్రిగా దౌత్యవేత్తగా రిహానాకు మంచి పేరుంది. ఆమె బ్రాండ్ ఫెంటీ బ్యూటీకీ ఎంతో క్రేజ్ ఉంది. ఆ బ్రాండ్ లోదుస్తులంటే అమ్మాయిలకు ఎంతో ఇష్టం. ఆమె బ్రాండ్ పేరును వాళ్ళ నాన్న రోనాల్డ్ ఫెంటీ ఆమెతో మాటైనా చెప్పకుండా కోటీ యాభైలక్షల డాలర్ల టాలెంట్ హాంట్ టూర్ డీల్ కుదుర్చుకొన్నాడు. మా అమ్మాయి కూడా ఇందులో పాల్గొంటుంది అని మాట ఇచ్చేశాడు. తన తండ్రి తన బ్రాండ్ పేరును తనకు చెప్పకుండా వాడు కొన్నందుకు రిహానా కోర్టులో కేస్ ఫైల్ చేసింది. ఈ గాయని ఆస్తుల విలువ ప్రస్తుతం 26కోట్ల డాలర్లు. ఎంత నాన్నైనా కూతుర్ని మోసం చేస్తే తప్పుకదా?

Leave a comment