మందార పూలు ఎంతందంగా  వుంటాయో అవి జుట్టుజు అంత మేలు చేస్తాయి. మందార పూలు ఎండబెట్టి  దానిని మెంతిపిండి కలిపి కొబ్బరి ఆలివ్ నూనెల్ని సమపాళ్లలో తీసుకుని అందులో కలిపేసి మరగనిచ్చి సీసాలో భద్రపరుచుకుని ప్రతిరోజు తలకి రాసుకుని తలస్నానం చేయచ్చు . కుదుళ్ళు ఆరోగ్యాంగా జుట్టు ఒత్తుగా మారుతుంది. అలాగే పొడిబారిన నిర్జీవమైన జుట్టుకు పచ్చి  మందార పూలను మెత్తగా పేస్ట్ గా చేసి ప్యాక్ వేసుకుని అరగంట పోయాక స్నానం చేయచ్చు. మందార పూవుల్లోనే కాదు ఆకుల్లోను సౌందర్య కరమైన ఔషధ గుణాలున్నాయి. శాకాయ  కుంకుడు కాయ వంటి వాటిలో స్నానం చేస్తుంటే జుట్టు డ్రై గా ఆయిపోకుండా అందులో మందారాకులు కలిపి స్నానం చేయచ్చు. నేరుగా గోరింటాకు పొడిని పట్టించటం వల్ల  జుట్టు పొడిగా అయిపోతుంది. ఈ సమస్య పోవాలంటే దానికి రెండు చెంచాల మందారాకు పొడి కలుపుకుని నాననిచ్చి తలకు పెట్టకుంటే జుట్టు మృదువుగా ఉంటోంది.

Leave a comment