Categories
నైట్ డ్యూటీలతో రాత్రీ పగలు నిద్ర వేళలు మారిపోతున్నాయి. రాత్రంతా మేలుకోవడం, ఏ మధ్య రాత్రో తినడం సర్వ సాధారణం అయిపోతుంది. దీని వల్ల చర్మం దెబ్బ తినే సమస్య వస్తుందిట. అంటే రాత్రి వేళ భోజనం చేసే అలవాటు పెంచుకుంటే, పగటి సమయంలో అతి నీలలోహిత కాంతి నుంచి చర్మాన్ని సంరక్షించే ఎంజైమ్ పని తీరు తగ్గిపోతుంది. ఫలితంగా చర్మం లోని డి.ఎన్.ఎ దెబ్బ తిని కాన్సర్లు రావడం, చర్మం ముడతలు పడటం వంటివి జరిగే అవకాశాలు ఎక్కువ వున్నాయని పరిశోధనలు చెప్పుతున్నాయి. అంచేత రాత్రి వేళ తినే అలవాటు మానుకుంటే మేలు.