నీహారికా,

దీపావళి పేరు చెపితే సత్యభామ గుర్తొస్తుంది. బాపు గీసిన సత్యభామ పెయింటింగ్ లో పెద్ద పెద్ద కళ్ళలో భాణం సంధించిన అందమైన సత్య భామ పక్కనే రథం పైన మూర్చలో ఉన్నట్లు నటిస్తూ, నవ్వుతున్న కళ్ళతో కృష్ణుడు కనిపిస్తాడు. అంత అందమైన సమర్థవంతమైన సత్యభామలు ఈ కాలంలో ఇంటికొకల్లు ఉన్నారు. చక్కగా చదువు పూర్తి చేసి ఎన్నో కళల్లో ఆరి తేరుతూ, కెరీర్లో దూసుకుపోతున్నారు. మాకు సాటి ఇంకెవరు అని గర్వంగా ప్రశ్నిస్తూ వెయ్యి చేతులతో సహాయం చేయగల మోడరన్ అమ్మాయిలు అలనాటి సత్యభామ అభిమానవంతురాలు. ప్రతి పని ఘనంగా చేస్తూ పది మందిలో ఒక్కరుగా కనిపించాలని,, తానేమిటో నిరూపించుకోవాలని తపన ఉన్న స్త్రీ మూర్తి. యుద్ద విద్యల్లో ఆరి తేరి స్త్రీ సాదించలేనిది ఏది లేదని నిరూపించిన ధీశాల. ఈ అంశ అంతో, ఇంతో అందరు ఆడపిల్లలో ఉంది. ఈ దీపావళికి అమ్మాయిలు హా చైతన్య మూర్తిని తలచుకొని తమ లోపలి శక్తిని అతం చేసుకొని, తెలివి తేటలకు మేరుగుయ్ పెట్టుకొని జీవితపు యుద్దాల్లో ఎప్పుడూ గెలుపు రుచి చూడాలని మనస్పూర్తిగా కోరుకొంటున్నారు నీహరికా. ఈ ప్రపంచలో అందరి అమ్మాయిలకు దీపావళి శుభాకాంక్షలు.

Leave a comment