నీహారికా,
వ్యక్తిగత సమయం ఉంచుకోవాలని సైకాలజిస్ట్ లు ఇచ్చి సలహాను పట్టించుకొంటున్నారా? చాల మంది ఆడపిల్లలు ఇంతే. వాళ్ళ కోసం టైం అన్నది అర్థం చేసుకోరు.ఉద్యోగం, కుటుంబ బాద్యతలతో ఎడతెరిపి లేని రొటీన్ శరీరం పై, మనస్సు పై ప్రభావం చూపెడుతోంది. అలాంటప్పుడు సొంత సమయం అంటూ రోజులో ఎంతో కొంత కేటాయించుకోండి అంటున్నారు డాక్టర్స్. మనల్ని మనం అర్థ చేసుకోవడానికి దొరికిన విరామంలో పరిస్థితులను సమీక్షించుకోవడానికి సమయం దొరుకుతుంది. దీనితో రొటీన్ నుండి కాస్త తెరిపిని తెచ్చుకొని క్లిష్టమైన సమస్యలను పరిష్కరించుకొనేందుకు అవకాశం వస్తుంది. అది రోజులో ఒక అరగంట కావచ్చు. ఆ అరగంటే పురుజ్జీవం ప్రసాదిస్తుందని వ్యక్తిగత సామర్ధ్యం పెరుగుతోందని అధ్యయనాలు చెప్తున్నాయి. అందుకే పరుగెత్తే కాలంతో, ప్రతి రోజు కనీసం 30 నిమిషాలు వ్యక్తిగత సమయం అనుకోవాలి. ఆ అరగంట ఫ్రెండ్స్ తో మాట్లాడవచ్చు, కాసేపు నడవచ్చు, పాటలు వినొచ్చు, ఏదో ఒక రకంగా రేస్ట్ గా ఉండొచ్చు. ఆ మీ టైం, మీ ఆరోగ్యానికి టానిక్ అంటున్నారు సైకాలజిస్ట్ లు.