ఫర్ఫెక్ట్ ఫిట్ నెస్ రోటీన్ ను అనుసరిస్తున్నా ఫలితం వుండటం లేదని చాలామంది కంప్లెయింట్. కొన్ని ఫిట్నెస్ తప్పిదాలుంటాయి. వాటిని ఫాలో అయితే కోరిన ఫలితం వుంటుంది. వర్క్ అవుట్స్ లో స్ట్రెచ్చింగుకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం మొదటి తప్పిదం. జిమ్ డాంసర్లకు ఆటలు ఏ విధమైన వ్యాయామం ఎంచుకున్నా ట్రైనింగ్ కు ముందుగా స్ట్రెచ్చింగ్ చేయాలి. వర్క్ అవుట్స్ మొదలు పెడుతూనే కీలకమైన అంశం పక్కన పెట్టేస్తారు. సరైన కదలికలతో స్ట్రెచ్చింగ్ చేయడం వల్ల కండరాళ్ళు వామప్ అవ్వుతాయి. ఆర్మ్ సైకిలింగ్, లెగ్ స్వింగ్స్, ఫోల్దర్ రోలర్స్మొదలైన వ్యాయామాలు నెమ్మదిగా చేస్తే హార్ట్ రేట్ బాగుంటుంది. స్ట్రాటిక్ స్ట్రెచ్లు తప్పనిసరిగా చేయాలి. రెసిస్టన్స్ రైనింగ్ జతచేస్తే జీవక్రియ పెరుగుతుంది. మరింతగా కొవ్వు కరిగిపోతుంది.
Categories