Categories
ఒక మళయాళ చిత్రంలో బైకర్ పాత్ర కోసం టోన్డ్ లుక్ కోసం నేను కష్ట బరువు తగ్గాలనుకొన్నాను. రెండు నెలల్లో నాఫిజిక్ మార్చుకున్నాను కానీ అందుకోసం నేను చాలా రీసెర్చ్ చేశాను అంటోంది లక్ష్మీరాయ్. నా మెటబాలిజం రేట్ చాలా నిదానంగా వుంటుంది. దాని గురించి పూర్తిగా కార్బోహైడ్రేడ్స్ మానేసాను. ప్రోటీన్ డైట్ కి వెళ్ళాను. చివరికి చపాతీలు కుడా లేవు. ఉడక బెట్టిన కూరగాయలు చికెన్ వంటి ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నాను బరువు తగ్గటం సులభమైన ప్రక్రియ కాదు. ఇది సవాల్ గా ఈ ట్రాన్స్ ఫార్మేశాన్ ప్లాన్ అమలు చేయాలనుకొన్నాను. కొంచెం డైట్ విషయం ఇబ్బంది పెట్టింది కానీ రెండు నెలల్లో 15 కిలోల బరువు తగ్గిపోయాను అని చెప్పుతుంది లక్ష్మీ రాయ్. దీన్ని గురించి ఆలోచిస్తే బావుంటుందేమో.