నీహారికా,

చాలా మంది పనుల విషయంలో చాలా పర్ ఫెక్ట్ గా ఉంటారు. అది మంచి అలవాటే కానీ సమస్య ఎక్కడ వస్తుందీ అంటే ఏ మాత్రం తేడా జారిగినా అంగీకరించని ధోరణిలో వుండే సందర్భాలు దెబ్బతింటాయి. మనం చేసే పని సక్రమంగా చేయచ్చు. రాజీ లేకుండా ప్రయత్నం చేయచ్చు. అదే అలవాటు ఎవరి పని చేసినా వంక పెట్టేంత గాడంగా అయిపోతేనే ప్రమాదం. కొత్త కొత్త అనుభవాలు కొన్ని పొరపాట్లు  తప్పులు సక్సెస్ లు, మానవ విదానంలో సంభవించే చర్యలుగా భావించాలి. మనం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాము పర్ ఫెక్షన్ కు అనుకోవాలి కానీ చెడు నుంచి మంచికి అనుకోకూడదు. అనుభవాలు మనల్ని ఇంకా పర్ ఫెక్ట్ గా ప్లాన్ చేయిస్తాయి. అదీ లాభం. అందుకే ప్రతి పనికి ఆనందం తో చూడాలి. ఎందుకంటే గతంలో కంటే ఇప్పుడెంత బాగా తయ్యారయ్యామనే ఆనందం మనస్సులో కలగక పోతే మన ఎదుగుదలను మనం అర్ధం చేసుకున్నట్లు ఒక్క సారి చిన్ని తేడా లోస్తా. ఇక ఆ పని పర్ ఫెక్ట్ గా చేయలేదా అనుకుంటూ బాధపడుతూ కూర్చుంటే దాన్ని చాదస్తం అనా. ఏ పని అయినా సమాగ్రంగా, సమర్ధత తో, శ్రద్ధ తో చేస్తేనే కదా సక్సెస్ అయ్యేది.

Leave a comment