మరాఠి డిజైన్స్ డోరీ నెక్లెస్ లు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సందడి చేస్తున్నాయి. నల్ల పూసల రకల్లాగా నల్లని దారానికి చిన్ని చిన్ని బంగారు లాకెట్లు గుచ్చిన నెక్లెస్ లు, మరఠా మహిళలు ఇష్టంగా ధరిస్తారు. ఇప్పుడు ఇలాంటి దారానికి లేదా సన్నని తీగకు చిన్ని బంగారు లాకెట్లు,కెంపులు, పచ్చలు, వజ్రాలు అంటించి నెక్లెస్ లు తయారు చేస్తున్నారు. ఎరుపు,నీలం, ఆకుపచ్చ దారాలు, నల్ల పూసలతో బంగారు తీగతో ఇ డోరీ నక్లెస్ లు ఇప్పుడు ఫ్యాషన్. కేవలం ఒక నల్లని దారానికి గుచ్చిన విలువైన వజ్రాలు, ముత్యాలు లాకెట్లు ఫ్యాషన్ డ్రెస్ ల పైకి బావుంటాయి.

Leave a comment