Categories
ప్రతి రోజు వుండే బిజీ షెడ్యుల్ తో వారానికి ఒక సారి షాపింగ్ చేసి అందులో ప్రతి ఆహార పదార్ధాన్ని ఫ్రిజ్ లో సర్దేసి అమ్మయ్య వారం రోజులు పర్లేదు అనుకుంటాం కానీ అన్నీ వెంటనే ఫ్రిజ్ లో పెట్టక్కర్లేదు. ఇప్పుడు బ్రెడ్ ని ఫ్రిజ్ లో పెడితే ఇందులో తేమ ఎండిపోయి గట్టిగా అయిపోతుంది. దీన్ని బయటే ఉంచాలి. అరటి పండ్లు గది ఉష్ణోగ్రత లోనే బావుంటాయి. బంగాళదుంపలు ఫ్రిజ్ లో పెడితే వీటిలోని పిండి పదార్ధాలు చెక్కరగా మారుతాయి. ఇవీ బయటే వుంచాలి. కేక్స్, కప్ కేక్స్, గట్టి తేనె ఫ్రిజ్ లో పెడితే కొన్ని రోజులు నిల్వ ఉంటాయి. తేనె ఫ్రిజ్ లో పెట్టనక్కరలేదు. . కాఫీ పొడి కి చుట్టూ పక్కల వాసనలు పీల్చే గుణం వుంటుంది. కనుక గాలి తగలని డబ్బాలో వుంచి బయటే ఉంచవచ్చు.