మా పిల్లలకు బెస్ట్ జీవితం ఇస్తాం అంటారు దాదాపు పేరెంట్స్ అందరూ. మరి సెలబ్రెటీలు ఏమంటారు? ఈ విషయం  దియా, దేవ్ లను పెంచుతున్న జ్యోతిక ని  అడిగితె వాళ్ళ స్కూల్లో మా సెలబ్రెటీ స్టేటస్ అస్సలు కనబడనివ్వం అంటూ చెప్పుతుంది. పిల్లల నియంత్రణకు సంబంధించి నేను స్ట్రిక్ట్. సూర్య మంచి కాప. వాళ్ళకు ఏది నచ్చితే అది చేసేందుకు అనుమతి ఇస్తుంటాడు. నేనయితే ఒక  నిబంధనల పుస్తకాన్ని. వాతావరణంలో సెలవుల్లో ప్రయాణాలు చెస్తుంటాం. ట్రిక్కింగ్ మా పిల్లలకు చాలా సరదా. ప్రతి సంవత్సరం ఇండియాలో ఓ మంచి ప్రదేశాన్ని పిల్లలకు చూపిస్తాం. క్రమం తప్పని రోటీన్ క్రమశిక్షణ నేర్పుతాను. టీవి, ఐపాడ్ లకు వాళ్ళను పరిమితం చేయకూడదన్నది నా అభిప్రాయం. అదనపు తరగతులు, ఎక్స్ ట్రా కారిక్యులర్ కార్య కలాపాలు ఈ ఎలక్ట్రానిక్ వస్తువులను వాళ్ళకు దూరంగా పెట్టేందుకు ఉపయోగ పడతాయి. మా కుటుంబంలో అందరూ సెలబ్రెటీలే అయినా మా సినిమాలు అన్ని మా పిల్లలు చూడనే లేదు అంటుంది జ్యోతిక. ఇక సూర్య అయితే పిల్లలు ఏం కోరనా ఒకే అంటుంటాడు, అంటుందామె నవ్వుతూ.

Leave a comment