Categories
ప్రముఖ డిజైనర్ పాయల్ జైన్ గౌన్ ఫ్యాషన్ కు పెట్టింది పేరు అందమైన చీరలో ఎంత నాజుకుదనం దాక్కుని వుందో గౌన్ లో కుడా అంటేనని ఆమె చెపుతారు. ఆమె డిజైన్ చేసిన గౌన్లు ఒకే రంగులో ఉండేవి ఎక్కువ. అలాగే గాఢమైన రంగులు వినూత్నమైన డిజైన్లు సున్నితమైన ఎంబ్రాయిడరీ పనితనం తో వుమెన్స్ వేర్ ఆమె బ్రాండ్ తో మార్కెట్ లో ఆకర్షిస్తూ కనిపిస్తాయి. శీతాకాలపు గౌన్ లో వెచ్చని అనుభూతిని ఇచ్చే ఎరుపు బచ్చలి రంగుల్లో చాలా బావుంటాయి. ఒకే వర్ణపు గౌన్ పై మెరిసే అదే రంగు దారం తో ఆమె చేసే ఎంబ్రాయిడరీ వర్క్ కుట్టి పడేస్తుంది.