గంటల తరబడి చదువుతారు కానీ రాయటం అంతగా  ప్రాక్టీస్ ఉండక పోవటం వల్ల పరీక్షల్లో ఇబ్బందులొస్తాయి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . పిల్లలకు చదవటం తో పాటు రాయటం కూడా నేర్పాలి . ప్రతిరోజూ ఏదైనా ఒక ఆన్సర్ ను మూడు నాలుగు సార్లు చూసి రాయాలి . అలా రాశాక చూడకుండా ప్రాక్టీస్ చేయాలి . ఒకటికి రెండు సార్లు చూసి రాయటం వల్ల రాసె వేగం పెరుగుతుంది . రాయటం సమయం వృధా చేయటం కాదని పిల్లల కు అర్ధం అయ్యేలా చెప్పాలి . ఒక సారి చూసి రాయటం పదిసార్లు చదవటానికి సమానం అని వాళ్ళను తెలియజెప్పాలి . పరీక్షల్లో రాయటం తప్పనిసరి కనుక పిల్లలకు అందులోని మెళుకువలు గురించి నేర్పటం శ్రేయస్కరం . చదవటం ఎంత ముఖ్యమో రాయటం కూడా అంతే ముఖ్యం .

Leave a comment