హోలీ హోలీ కే రంగ్ హోలీ
              చెమ్మ కేళిరె హోలీ
పాల్గుణ శుద్ధ పౌర్ణమి అనగా హోలీ.ముందుగా అందరికీ శుభాకాంక్షలు.ఈ రోజు అందరు సంతోషంతో ఒకరిపై ఒకరు రంగులు వేసుకుని సరదాగా గడుపుతారు.
పూర్వం రాక్షస రాజైన హిరణ్యకశిపుడు తనను ఎట్టి పరిస్థితులలో,పగలు-రాత్రి అనక వధించుట తరం కాదని బ్రహ్మ వద్ద వరం పొందాడు.తన కుమారుడైన ప్రహ్లాదుడు అపారమైన విష్ణు భక్తి కలవాడు.తండ్రి కి వ్యతిరేకం.హోలిక అని హిరణ్యకశిపుని సోదరికి ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చుండబెట్టి అగ్నిలో కి పొమ్మన్నాడు.హోలిక అగ్నికి ఆహుతి అయ్యింది కాని ప్రహ్లాదుడు విష్ణు మూర్తి భక్తితో క్షేమంగా బయటికి వచ్చాడు.ఈ సందర్భంగా జనులందరూ రంగులు జల్లుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కుల మత భేదం లేకుండా ఆడే పండుగ.
నిత్య ప్రసాదం: కొబ్బరి,పాయసం.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment