ఎన్నో పద్ధతులు మార్చుకోవలసి వస్తోంది . కాలం మారుతోంది కదా మహిళల చేతుల్లో ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది . హ్యాండ్ బ్యాగ్లో కొన్ని వస్తువులు చేర్చుకోమంటున్నారు ఎక్స్ పర్డ్స్ . శానిటైజర్లు ,ఫేస్ వైప్స్ ,శానిటరీ నాప్కిన్ లు ,బొట్టు బిళ్ళలు తినేందుకు డ్రై ఫ్రూట్స్ ,నీళ్ళసీసా సరే . ఇప్పడీ రోజుల్లో కొన్ని స్వీయరక్షణ కోసం తప్పని సరిగా బ్యాగ్ లో ఉంచుకోవలసిన వస్తువులున్నాయి . అనుకోని కారణాలలో ఆఫీస్ లో లేట్ అవ్వచ్చు బ్యాగ్ లో పెప్పర్ స్ప్రే వంటివి ఉండాలి . ఫోన్ లో పోలీస్ స్టేషన్ లతో అనుసంధానం అయ్యే యాప్ ని యాడ్ చేసుకొని ఉండాలి . ఈ మధ్య కాలంలో గొలుసు లాకెట్ లలో ,కీ చెయిన్ లో,వాచీలు,గాజులు అమర్చుకొనే అలారం వంటివి వస్తున్నాయి . వాటి గురించి ఆలోచించండి . ఆత్మరక్షణ కోసం కొన్ని మన బ్యాగ్ లో ఉంటె ఎక్కడకు వెళ్ళినా ధైర్యం గా ఉంటుంది .

Leave a comment